నేడు గద్దర్ వర్ధంతిని విజయవంతం చేయండి

కామారెడ్డి జిల్లా, ఆగష్టు 05 (లోకంతీరు) : హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతిని విజయవంతం చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్ హెచ్ పి ఎస్) రాష్ట్ర కార్యదర్శి వినోద్ కుమార్ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రజా యుద్ధ నౌక గద్దర్ జీవితం ప్రజల కోసం అంకితం చేశారని తన పాటలతో ప్రజా యుద్ధాన్ని నడిపించారని ఆయన జీవితం ప్రజలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన బ్రతికినన్ని రోజులు ప్రజల కోసం బ్రతికారని అలాంటి మహానుభావుని వర్ధంతిని అధికారికంగా జరుపుకోవాలని కోరారు. ఆయన వర్ధంతికి పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.