Take a fresh look at your lifestyle.

ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు….

0 1,523

ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్  అంబేద్కర్ 133వ  జయంతి ఉత్సవాలు

కామారెడ్డి జిల్లా, ఏప్రిల్ 14 ( లోకంతీరు ) :  కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి మాదిగ రాజకీయ పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ నాయకులు డా. బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి ఆదివారం పూలమాలలు ఘనంగా జయంతి నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి ఎన్నో ఫలాలు తెచ్చి పెట్టిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఇచ్చాడని అన్నారు. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మాట్లాడుతూ రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ బిల్లు, ఎస్సీలకు రావాల్సిందో ఇవ్వాలని చెప్పినా మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.

కాబట్టి ఇప్పుడు ఏ రాజకీయ ప్రభుత్వాలు వచ్చిన ఆన్యాయమైన మాదిగలకు రావలసిన రాకుండా చేయడమే ఈ రాజకీయ నాయకులు చేస్తున్న మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును చేపించి పెడతామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. వందరోజులు అయిపోయాక కూడా వర్గీకరణ చేయకపోవడం సిగ్గుచేటని, మాదిగ విశ్వరూప మహాసభకు హైదరాబాదుకు రావడం జరిగింది. అప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదన్నారు. అది నమ్మిన మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అండదండగా ఉంటూ 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అయినా ఎస్సీ వర్గీకరణ బిల్లును నరేంద్ర మోడీ బిల్లు పాస్ చేయకపోవడం సిగ్గుచేటని, మాట మాదిగలకు ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు బిజెపి ఎంపీలను గెలిపించాలని ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్తున్నాడు. కానీ ఎవరు నమ్మద్దు ఎవరైతే ఓట్లు అడగడానికి వస్తారో మాదిగలంతా బుద్ధి చెప్పాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవతి రెడ్డి ని మాదిగలు కోరేటి ఒక్కటే న్యాయం చేస్తావని వర్గీకరణ చేపిస్తావని అనుకుంటున్నాం. ఈ రెండు ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేయకపోతే రాబోయే ఎలక్షన్ల మాదిగలు బుద్ధి చెబుతారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.