Take a fresh look at your lifestyle.

ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

0 1,287

ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 

కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 ( లోకంతీరు ) : నిజాంసాగర్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం తనిఖీ చేశారు. ఆసుపత్రి నందు హాజరు పట్టిక ను చూసి తేదీ: 27-07-2024 నుండి నేటి వరకు విధులకు హాజరు కానీ జూనియర్ అసిస్టెంట్ సుభాష్ ను సస్పెండ్ చేశారు. రెగ్యులర్ గా విధులకు హాజరు కానీ ల్యాబ్ టెక్నీషియన్ నవ్యశ్రీ ని కలెక్టర్ ను సంజాయిషీ కోరారు. ఇన్ పేషెంట్ వార్డును పరిశీలించి రోగులతో మాట్లాడి ఆసుపత్రి లో అందుతున్న రోగుల సేవల పై సంతృప్తి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న మందుల వివరాల గూర్చీ వైద్యాధికారి డా. రోహిత్ కుమార్ ను అడగడం తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నాటిన హరిత హారం చెట్లను పరిశీలించారు. మెడికల్ వేస్ట్ ను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా గుంతలలో వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి డా. చంద్ర శేఖర్, ఉప వైద్యాధికారి డా. విద్య, మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.