Take a fresh look at your lifestyle.

మండల కేంద్రంలో శ్రీ రేణుక దేవి వార్షిక ఉత్సవాలు……

0 1,472

శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవి పంచమ వార్షిక ఉత్సవాలు

రాజంపేట, ఎప్రిల్ 19 ( లోకంతీరు ) : రాజంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవి పంచమ వార్షిక ఉత్సవాలు నేడు శనివారం నుండి ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూన్నట్లు గౌడ సంఘం పెద్దలు తెలిపారు. మొదటి తేదీ 20- 04-2024 శనివారం పుణ్య వచనం, అంకురా రోహణం, అభిషేకము, తేదీ 21-04-2024 ఆదివారం అమ్మవారి విగ్రహం ఊరేగింపు, పోచమ్మ బోనాలు, తేదీ 22-04-2024 సోమవారం హోమము, గంగా బోనం, రాత్రి ఓగ్గు కథ, తేదీ 23-04-2024 మంగళవారం రోజు కుంకుమ అర్చన, హోమం, రేణుక జమదగ్ని కళ్యాణ ఉత్సవం, ఓడి బియ్యం, అన్నదాన కార్యక్రమం, తేదీ 24-04-2024 బుధవారం దేవి పూజ, హోమం కలదు. కావున మండలంలోని పలు గ్రామాల భక్తులు, ప్రజలు అమ్మవారి ఆశిస్సులు పొందగలరని రాజంపేట గ్రామ గౌడ సంఘం సభ్యులు పత్రిక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.