
క్రీడలకు సింగరేణిలో ప్రత్యేక ప్రాధాన్యత : జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
భూపాలపల్లి ఏరియా నుంచి ప్రతిభావంతులను ప్రోత్సహించాలి.
భూపాలపల్లి ఏరియా డబ్ల్యూ.పి.ఎస్. అండ్ జి.ఏ. క్రీడా కమిటీ నియామకం.
స్పొర్ట్స్ కోఆర్డినేటర్ గా జి .నాగేశ్వర్ రావు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 27: సింగరేణి సంస్థలో ఉద్యోగుల సంక్షేమంలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. క్రీడల ద్వారా ఉద్యోగుల్లో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతాయని పేర్కొన్నారు. భూపాలపల్లి ఏరియా నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి అవసరమైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పించాలని సూచించారు. భూపాలపల్లి ఏరియా 2026-27 సంవత్సరానికి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూ.పి.ఎస్. అండ్ జి.ఏ.)క్రీడా కమిటీని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నియమించారు. ఈ వివరాలను ఏరియా అధికార ప్రతినిధి ఎస్. శ్యాంసుందర్ గురువారం వెల్లడించారు. క్రీడా కమిటీలో అధ్యక్షుడిగా ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి. శ్యాంసుందర్, ప్రధాన సమన్వయకర్తగా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, గౌరవ కార్యదర్శిగా సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎం. సాయికృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, సమన్వయకర్తగా ఓసీ-3 ఫిట్టర్ జి. నాగేశ్వర్రావు నియమితులయ్యారు. వివిధ క్రీడలకు జనరల్ కెప్టెన్‌గా సిహెచ్. ప్రసాద్ ను నియమించారు. ఫుట్‌బాల్ కెప్టెన్‌గా టి.పురుషోత్తం, హాకీ కెప్టెన్‌గా బి.విక్రమ్, క్రికెట్ కెప్టెన్‌గా పి.రాజు, కబడ్డీ కెప్టెన్‌గా టి.గణేష్, వాలీబాల్ కెప్టెన్‌గా జి.లక్ష్మణ్, బాల్ బ్యాడ్మింటన్ కెప్టెన్‌గా టి.తిరుపతి, బాస్కెట్‌బాల్ కెప్టెన్‌గా ఎం.ప్రణయ్, లాన్ టెన్నిస్ కెప్టెన్‌గా పి.శ్రీరాములు, క్యారమ్ కెప్టెన్‌గా ఎం.వి.రావు, చెస్ కెప్టెన్‌గా జి.రాజ్‌కుమార్, టేబుల్ టెన్నిస్ కెప్టెన్‌గా ఆకుల శ్రీనివాస్, షటిల్ బ్యాడ్మింటన్ కెప్టెన్‌గా మేడ మల్లేష్ నియమితులయ్యారు. అలాగే బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ కెప్టెన్‌గా ఎస్. శ్రీనివాస్ రెడ్డి, సాంస్కృతిక కార్యక్రమాల కెప్టెన్‌గా ఎం. కేశవులు, స్విమ్మింగ్ కెప్టెన్‌గా కె. రాజమౌళి, అథ్లెటిక్స్ కెప్టెన్‌గా కె. కతేరసాల, మహిళా విభాగం కెప్టెన్‌గా దువ్వా అనూషను నియమించారు. ఈ సందర్భంగా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ క్రీడల్లో భూపాలపల్లి ఏరియాకు మంచి పేరు తీసుకువచ్చేలా క్రీడా కమిటీ కృషి చేయాలని కోరారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, వారికి తగిన శిక్షణ, ప్రోత్సాహం, అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.