రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం

కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 25 (లోకంతీరు) : పీఎంపీ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఫరీద్ పేట్ శ్రీనివాస్ పి ఎం పి కుటుంబమునకు 33 వేల ఆర్థిక సాయం అందించారు. కామారెడ్డి జిల్లా పి.ఎం.పి అసోసియేషన్ తరఫునుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి 33 వేల నాలుగు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పులగం మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాడి పల్లి బాలకిషన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. డిచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు గడీల చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.