సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ నాగరాజు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, సెప్టెంబర్ 7: జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సౌరభ్ శర్మను కాటారం తహసీల్దార్ నాగరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్‌కు పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు.