ఎవరు చేయలేని సేవలు,ఇందుర్ యువత చేస్తుంది


నిజామాబాద్, నవంబర్ 01( లోకంతీరు ) : ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు అందరికి స్పూర్తిగా నిలుస్తాయి.అనాధలకు అభాగ్యులకు సేవా చేయడం గోప్ప విషయమని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ అన్నారు .గురువారం ఇందుర్ యువత కార్యాలయం సందర్శించి మాట్లాడరు.ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయాన్ని గురువారం సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నూడా ఛైర్మన్ కేశవేణు పాల్గోన్నారు. అనంతరం తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ఎవరు చేయలేని సేవలు ఇందూరు యువత చేస్తుందని మానవత్వానికి ప్రతికగా ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ నిలుస్తుందని పిలుపునిచ్చారు. మనశ్శాంతి కోవెల ఆశ్రమ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు .అంతరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతు మానవ సేవే మాధవ సేవ అన్న మాటను నిజం చేస్తు చూపిస్తున్న విరి సేవలు మరువలేనివి అన్నారు. అలాగే ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ నిరంతరము సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.అనంతరం కేశవేణు మాట్లాడుతూ నిరంతర అన్నదానం,అనాధ శవాలకి అంత్యక్రియలు, మతిస్థిమితం లేని విదివంచితులు సపర్యలు చేయడం ఆ సేవలు కేవలం ఇందూరు యువతకే సాధ్యం అన్నారు. తమవంతు సహకారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కి ఎల్లప్పుడూ ఉంటుందని మంచి కార్యక్రమాలకి తోడుగా ఉంటామని అన్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు చిట్టిమిల హరిప్రసాద్ మాట్లాడుతూ తమ సేవా సంస్థ నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబు అతిధులతో మిడ్ నైట్ స్పేషల్ బేడ్షిట్స్ డ్రైవ్ కార్యక్రమం (అనాధలకు అభాగ్యులకు విదిలించితులకు దుప్పట్ల పంపిణి) ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దారం గంగాధర్, సిర్ప లింగం,మద్ది గంగాధర్, వాల బాలకిషన్, లక్కంపల్లి సంజీవన్రావ్,రాజేష్ శర్మ,గైని గంగారం ,జంగం రాజు, ఇందూరు యువత కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులు కాంగ్రేస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గైని గంగారం ఆధ్వర్యంలో తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి సర్దార్ వీరేందర్ సింగ్ తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.