Take a fresh look at your lifestyle.

ఘనంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం 29వ ద్వైవార్షిక మహాసభలు. సంఘం అధ్యక్షుడిగా అప్పాని శ్రీనివాస్ ఎన్నిక.

0 30

ఘనంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం 29వ ద్వైవార్షిక మహాసభలు.                                                                                      నూతన కమిటి ఎన్నిక, పలు తీర్మానాలు.                                                                                                                                      సంఘం అధ్యక్షుడిగా అప్పాని శ్రీనివాస్ ఎన్నిక.                                                                                                                              (ప్రజాలక్ష్యం ప్రతినిధి)                                                                                                                                                                            జయశంకర్-భూపాలపల్లి, జూన్ 8:
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (ఏబీకేఎంఎస్–బీఎంఎస్) 29వ ద్వైవార్షిక మహాసభలు ఆదివారం భూపాలపల్లి పట్టణంలోని పైలెట్ కాలనీలోని సింగరేణి ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ సింగరేణి ఏరియాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, కార్మిక నాయకులు హాజరై మహాసభలను విజయవంతం చేశారు. ఈ మహాసభలకు బీఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌ఛార్జి, స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అపెక్స్ సీఎఐఎల్ మరియు సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల అమలు, కార్మిక సంక్షేమమే భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. బీఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ఏబీకేఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షురాలు వడ్డే పూర్ల, ఏబీకేఎంఎస్ జాతీయ కార్యదర్శి పి. మాధవన్ నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాడుతుందని, భవిష్యత్తులో మరింత బలంగా కార్మిక ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహాసభలో గత రెండేళ్ల కాలంలో సంఘం నిర్వహించిన కార్యక్రమాలు, కార్మికుల కోసం సాధించిన విజయాలు, పెండింగ్ సమస్యలపై చర్చించారు. సింగరేణిలో కార్మికుల సంక్షేమం, భద్రత, ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు, సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా 2026-2028 కాలానికి గాను నూతన కేంద్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కేంద్ర కమిటీ వివరాలు:

సంఘం అధ్యక్షుడిగా భూపాలపల్లికి చెందిన అప్పాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామగుండంకు చెందిన యాదగిరి సత్తయ్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వై.సారంగపాణి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా అరుకాల ప్రసాద్ (రామగుండం), లాబ్ వెంకటేశ్వర్లు (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా వడ్డేపల్లి కుమారస్వామి (రామగుండం), డిప్యూటీ జనరల్ సెక్రటరీగా జి.వి. కృష్ణారెడ్డి (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. సెక్రటరీలుగా మదాసి రవీందర్ (రామగుండం), రాగం రాజేందర్ (శ్రీరాంపూర్), దొనికిన రమేష్ (మందమర్రి), సతుకూరి శ్రీనివాస్ (భూపాలపల్లి), పాండ్రాల మల్లేష్ (భూపాలపల్లి) ఎన్నికయ్యారు. చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా టి.ఎస్. పవన్ కుమార్ (కొత్తగూడెం) ఎన్నిక కాగా, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె. శ్రీనివాస రాజు (మందమర్రి), ఆకుల హరీన్ (రామగుండం), గీడి ప్రభాకర్ (శ్రీరాంపూర్), ఈర్ల సదానందం (భూపాలపల్లి), యు. తిరుపతి (మందమర్రి) ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా సాయవేని సతీష్ (రామగుండం) ఎన్నికయ్యారు. ఆఫీస్ సెక్రటరీ పదవిని ప్రస్తుతం ఖాళీగా ఉంచినట్లు సమావేశంలో ప్రకటించారు. నూతన కమిటీ ఎన్నిక అనంతరం నాయకులను మహాసభలో ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం సంఘం మరింత చురుకుగా పనిచేస్తుందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చలు జరిపి, అవసరమైతే ఉద్యమాల ద్వారా పరిష్కారం సాధిస్తామని స్పష్టం చేశారు. మహాసభలో పాల్గొన్న ప్రతినిధులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.