రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

బాన్సువాడ/కోటగిరి , జనవరి 26 ( లోకం తీరు ) : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోటగిరి,పొతంగల్ మండలాలలో వాడవాడనా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.వివిధ పార్టీల నాయకులు,ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రభుత్వ కార్యాలయా లలో,ప్రైవేట్ సంస్థలలో,పాఠశాలలో,కళాశాలలో జాతీయ జెండా ఆవిష్కరించారు.పలు పాఠశాల లో కళాశాలలో విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఉమ్మడి కోటగిరి మండలంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలలో ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ కర్తలను స్మరించుకున్నారు.