చిల్లర వ్యాపారులపై ఉన్న శ్రద్ధ…. బడా వ్యాపారుల మీద లేకపాయే….
– నిజామాబాద్ లో వీధి వ్యాపారులతో ట్రాఫిక్ పోలీసు వాగ్వివాదం
– కనుమరుగైన అధికారులు
– స్థానిక నాయకుల కనుసైగల్లోన ?

నిజామాబాద్ అర్బన్, జులై 26 ( లోకంతీరు ) : నిజామాబాద్ కు రోజు చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు తాము పండించిన కూరగాయలను అదేవిధంగా కొంతమంది తాము తమ కుటుంబాన్ని పోషించే నిమిత్తం ఉదయం జరిగే బీట్ లో కూరగాయలను కొనుక్కొని వచ్చేవాళ్లు దేవి రోడ్డు ప్రాంతంలో, నాందేవ్వాడ బ్రిడ్జ్ దిగే స్థలంలో , గంజి రోడ్డులో అమ్ముకోవడం జరుగుతుంది. వారు రోజువారీగా థాయ్ బజార్ కి డబ్బులు చెల్లిస్తూ కూడా ఎండా,వాన అనకుండా వాళ్లు తెచ్చిన కూరగాయలను పనులను అమ్ముకొని వారు తమ జీవనాన్ని గడుపుతుంటే అదే అదునుగా తీసుకొని అక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వారిపై దౌర్జన్యంగా వ్యవహారిస్తూ మీ వల్ల ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని బెదిరిస్తూ అంతేగాకుండా వారి దగ్గర కొనుగోలు చేసే వినియోగదారుడికి ట్రాఫిక్ ఛానల్ వేయడం ఇది ఏమిటని ప్రశ్నించిన వారిపై కూడా దౌర్జన్యంగా వ్యవహరించడం జరుగుతుంది. కానీ బడా వ్యాపారులు ప్రధాన రోడ్లపై, కూడళ్ళ పై సగముకు పైగా రోడ్లను ఆక్రమించి తమ వ్యాపారాలు నిర్వహిస్తున్న కూడా వారిని అడిగి ప్రశ్నించే దిక్కు లేదు.చట్టాలన్నీ ఎప్పుడు పెద్దవారికి చుట్టాలే. వాటితో అల్ప ప్రాణులకు ఎపుడు కష్టాలే.వీధి వ్యాపారులను ప్రోత్సహించదానికే కదా మున్సిపల్ శాఖ తైబజార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి దానికిగాను టెండర్లను నిర్వహించి లక్షలలో తీసుకోవడం జరుగుతుంది.
ఇలాంటి వీధి వ్యాపారులు దేవి రోడ్డు చౌరస్తా, గాంధీ చౌక్, బోధన్ బస్టాండ్, నటరాజ్ థియేటర్ , శివాజీ చౌక్ ప్రాంతం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రదేశాలలో చాలామంది చాలా గ్రామాల నుంచి వచ్చి వీధి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వినియోగదారులు వాటిని కొనే క్రమంలో నగర ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలకు వేసే ఛానల్లు చూసి బెంబేలెత్తుతున్నారు. కొనుగోలుదారులకు అదే విధంగా వీధి వ్యాపారుల పట్ల సంయమనతో వ్యవహారిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్ అధికారులు , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే , నిజామాబాద్ ఎంపీ, ఈ వ్యవహారంనకు సంబంధిన అధికారులు ఈ సమస్యల పట్ల సానుభూతితో వ్యవహారిస్తూ వీధి వ్యాపారాలకు ఏదైనా ఒక అనుకూలమైన ప్రాంతాన్ని తమకు కేటాయించి న్యాయం చేయాలనీ వీధి వ్యాపారాలు కోరుతున్నారు.
ఈ విషయమై ఒక స్థానిక రిపోర్టర్ ట్రాఫిక్ పోలీసును ప్రశ్నించటంతో … వీధి వ్యాపారులతో , విలేకర్ల పైన అసహనం వ్యక్తం చేశాడు . ఇలా రోజూ జరిగే సమస్యపై అధికారులు ద్రుష్టి సారించి పరిష్కరించగలరని ప్రజలు కోరుతున్నారు.