ప్రభుత్వ పాఠశాలకు వంట పాత్రలు విరాళం

నిర్మల్ జిల్లా/తానూర్, ఫిబ్రవరి 3 ( లోకం తీరు న్యూస్ ) : నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని భోసి గ్రామ ప్రభుత్వ పాఠశాలకు గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి, విడిసి కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ భాలేరావు పాఠశాల కమిటీ సభ్యులకు వంట పాత్రలు విరాళంగా అందజేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వంట పాత్ర అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు శివరాత్రి ఆనంద్, మోహన్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ పసుల నాగనాథ్, ఎస్ఎంసి చైర్మన్ బాయి నాగేష్, విఠల్, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు వందన, గంగాధర్ గ్రామస్తులు పాల్గొన్నారు.