ఎర్గట్ల లో స్వచ్ఛదనం -పచ్చదనం అవగాహన![]()
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 03 ( లోకంతీరు ) : ఎర్గట్ల మండల రైతు వేదికలో 05/08/2024 నుండి 09/08/2024 వరకు నిర్వహించబోయే స్వచ్చదనం – పచ్చదనం గురించి అవగాహన సమావేశం జరిగింది,ఇందులో ప్రతీ జీపీ లో గ్రామస్థాయి అధికారులతో, గ్రామ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి, శానిటేషన్ పనులు, ఆరోగ్య సర్వే పనులు, మొక్కలు నాటే పనులు నిర్వహించాలని, అందరూ ప్రభుత్వ అధికారులు తప్పకుండ పాల్గొని విజయవంతం చేయాలనీ కోరడం జరిగింది.ఇందులో ఎంపీడీఓ , ఎంపీఓ , ఏపీఎం గారు, ఏపిఓ, అంగన్వాడీ సూపర్వాయిజర్ , పంచాయతీ కార్యదర్శులు, ఏ యన్ ఏం లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, టీ ఏ లు ఐకేపీ సీసీ లు, వి వో ఏ లు పాల్గొన్నారు.
