చంద్రశేఖర్ కాలనీలో ఒకరి హత్య

నిజామాబాద్ , ఫిబ్రవరి 14 ( లోకం తీరు ) : నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల రోటి దుకాణం వద్ద జరిగిన గొడవలో ఒక యువకుడు మరణించాడు. మృతుడు స్థానికంగా నివాసముండే జమీల్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. జమీల్ ఖాన్ సోను మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం వల్ల సోను ఒక ఆయుధంతో దాడి చేయగా ఘటన స్థలంలో జమీల్ మృతి చెందాడు. నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది గొడవలు వల్లే హత్య జరిగిందా.. లేక ఇతర కారణాల వల్ల హత్య జరిగిందా .. అని పోలీసులు అనుమానిస్తున్నారు.