Take a fresh look at your lifestyle.

తలమడ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులను ప్రశంసించిన కలెక్టర్…

0 1,437

తలమడ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులను ప్రశంసించిన కలెక్టర్

రాజంపేట, మార్చి 14 ( లోకంతీరు ) : అంతర్జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా గణిత విలువను 100 దశాంశ స్థానాల వరకు అనర్గలంగా చదివిన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని తలమడ్ల ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు దొమ్మటి బిక్షపతిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రశంశించారు. 

తాడ్వాయి మండలము కెజిబివి లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముందు 8 వతరగతి విద్యార్థిని ఉట్ల ఉశశ్రీ కేవలం 9 సెకనులతో పై విలువను 100 దశాంశ స్థానాలకు చదివి కలెక్టర్ ను ఆశ్చర్యపర్చారు.అలాగే 8వ తరగతి విద్యార్థులు తరుణి, నవిత, రిశిత్ర, అఖిల, విగ్నేష్, శశిధర్ లు 9 వతరగతి విద్యార్థులు సాత్విక్, లిఖితలు పై విలువను వీరిని కలెక్టర్ ప్రశంశించారు. 100 దశాంశ స్థానాలకు చదువగా గణితంలో వాడే ఒక స్థిరరాని పేరు పై ఇది అంతము కొని అనావర్తన దశాంశము. ఇది ఒక కరణీయసంఖ్య- దీని విలువ 3.141592… ఇలా అనంతము వరకు దశాంశ స్థానాలు ఉంటాయి.తలమడ్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న దామ్మటి బిక్షపతి గతంలో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే పై విలువను 2000 స్థానాలకు చదివించి “మ్యాథ్స్ జీనియస్ వరల్డ్ రికార్డ్” తెలగు బుక్ ఆప్ రికార్డ్స్ పలు రికార్డులను సాధించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ రామస్వామి, ఉపాధ్యాయులు చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.