విద్యార్థుల పోరాట ఫలితమే
– ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం
– ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

నిజామాబాద్, సెప్టెంబర్ 13 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడాన్ని స్వాగతిస్తున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కాలేజిగా అప్గ్రేడ్ చేయాలని 2022 సంవత్సరం నుండి నేటి వరకు పి.డి.ఎస్.యు వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేసిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారిని కలిసి ఇంజనీరింగ్ కాలేజి అనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థుల ఆకాంక్ష అని తెలిపారన్నారు. ఉమ్మడి నిజామబాద్ జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు ఉపయోగకరమని పి.డి.ఎస్.యు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.
ఫలితంగా ప్రభుత్వం నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడడం ద్వారా నిజామబాద్ జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేద విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందుతుందన్నారు. ఇది పి.డి.ఎస్.యు నాయకత్వంలో పోరాడిన పాలిటెక్నిక్ విద్యార్థుల విజయం అని తెలిపారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ అప్గ్రేడ్ చేయడానికి కృషిచేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి ధన్యవాదాలు తెలిపారు. వెంటనే ఇంజనీరింగ్ కాలేజ్ అప్గ్రేడ్ సంబంధించిన నిధులను విడుదల చేసి, ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల పి.డి.ఎస్.యు విద్యార్థి నాయకులు శ్రీకాంత్,మహేష్,తరుణ్,కోహ్లీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.