ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

ఎల్లారెడ్డి , నవంబర్ 02 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని శనివారం జిల్లా ఎస్పీ సింధు శర్మ సందర్శించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మకు, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై బొజ్జ మహేష్ స్వాగతం పలికారు, పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ కేసులో గురించి సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మహేష్ అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ డైరీ రిసెప్షన్ రిజిస్టర్ ని తనిఖీ చేసి మండల పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు, ఫిర్యాదుల కేసులో స్థితిగతులను మొదలగు అంశాలను పరిశీలించారు. నాణ్యమైన వేగవంతమైన దర్యాప్తు చేయాలని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సిబ్బందికి సూచించారు. ఎస్సై కానిస్టేబుల్ కు సూచనలు బహిరంగ ప్రదేశాలు మద్యం సేవించడం, నిషేదించాలని డ్రంక్ అండ్ డ్రై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ కోరారు. కార్యక్రమంలో సీఐ రవీందర్ నాయక్, ఎస్సై బొజ్జ మహేష్,ఏఎస్సై నరేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.