Take a fresh look at your lifestyle.

స్పెషల్ పాలన ఇంకెన్నాళ్లు..?

0 1,272

స్పెషల్ పాలన ఇంకెన్నాళ్లు..?

— కుంటుపడుతున్న గ్రామ పాలన..?
— స్పెషల్ ఆఫీసర్లు తో సమన్వయ లోపం..?
— పరిశుద్ధ లోపం ప్రజల ప్రాణాలకు శాపం..?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , జూలై 29 ( లోకంతీరు ) : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ పాలన ముగిసి చాలా రోజులు అవుతుంది. సర్పంచ్ ల పాలన ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం వారి స్థానాలలో స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ప్రస్తుతం స్పెషల్ అధికారులు సెక్రటరీలు యధావిధిగా పని చేయాల్సిన అవసరం బాధ్యతతో కూడుకున్న వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థను సమన్వయ లోపం వలన కొన్ని గ్రామాలలో చాలా రకాల అత్యవసర పనులు, అదేవిధంగా పారిశుద్ధ్యం, మంచినీరు, ప్రస్తుతరణంలో ఇలాంటి పై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పల్లెల్లో పంచాయతీలు సరిగా పనిచేయక స్పెషల్ పాలన అధికారులు, సెక్రటరీలు సమన్వయంతో కలిసి పని చేస్తే అభివృద్ధి యదా విధంగా కొనసాగుతోంది. కానీ అసలే గ్రామపంచాయతీలకు స్పెషల్ అధికారులను నియమించడం వలన కొంత సమస్య ఏర్పడుతూ గ్రామాలను కొన్ని అత్యవసర, నిత్యవసర, పారిశుద్ధ్యం కుంటుపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుమారు 70% గ్రామ పంచాయతీలలో ఇదేతంగం, గ్రామాలలో సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు సోకి ప్రజలు మంచాము పడుతున్నారు. పారిశుద్ధ పనులు నిర్వహించవలసిన స్పెషల్ ఆఫీసర్లు గ్రామ కార్యదర్శులు చేతులు ఎత్తేయడం తో ప్రజలు దోమల బారిన పడి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.
పలు గ్రామాలలో విష జ్వరాల బారిన పడుతూ చాలామంది ప్రజలు హాస్పిటల్ ల పాలవుతున్నారు. పనులు చేపించవలసిన పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలలో నిధులు లేవని చేతులెత్తేస్తున్నారు.
చాలా గ్రామాలలో చెత్తను పారవేసె ట్రాక్టర్లు కూడా గ్రామాలలో తిరగడం లేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవని వారు పనికి రావడం లేదు. అని కొందరు కార్మికులు బాధతో నక్కిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్టు పత్రికా ప్రకటన చేసిన అమలు కావడం లేదు.? దీనితో మార్మూల గ్రామంలోని ప్రజలు విషజ్వరాల పడి వేలాది రూపాయలు దవఖానాలలో ఖర్చు చేసుకుంటున్నారు.గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాలలో వైద్య సదుపాయం కల్పించి,వైద్యం అందించే క్యాంపులు ఏర్పాటుచేసి గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కాపాడాలని మేధావి వర్గం యువత భావిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.