సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన…
– వైద్యాధికారి డాక్టర్ సుప్రియ

వేల్పూర్, జులై 30 ( లోకంతీరు ) : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలలో అవగాహన కల్పిస్తూ వైద్య సిబ్బంది చేస్తున్న సర్వే ను వైద్యాధికారి డాక్టర్ సుప్రియ పర్యవేక్షించారు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.ముఖ్యంగా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మొదలగునవి వ్యాపిస్తాయని ఆమె తెలిపారు కావున ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు కావున ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే గా పాటించాలని ఆమె తెలిపారు వాడిన కూలర్లను శుభ్రం చేసుకోవాలని ఇంటి చుట్టుపక్కల పరిసరాలను ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా దోమలను అరికట్ట వచ్చిన ఆమె తెలిపారు అదే విధంగా ఈ వర్షాకాలంలో ప్రజలు బయట తినుబండారాలను తినకూడదని ఇంటిలోనే తాజా ఆహారాన్ని గురించి ఆమె తెలిపారు దీని ద్వారా డయేరియా డీసెంట్రీ టైఫాయిడ్ మొదలగునవి రాకుండా చూసుకోవచ్చని ఆమె తెలిపారు ఈ ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ ఏఎన్ఎం గీత పాల్గొన్నారు