ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కృషితో నియోజక వర్గ పరిధిలో మొట్ట మొదటి ఆగ్రో ఇండస్ట్రీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గం సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామం శివారులో టి ఎస్ ఐ ఐ సి ఇండస్ట్రియల్ జోన్ లో వివేక్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ కి శంకుస్థాపన చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శంఖుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ తాను ఎల్లారెడ్డి నియోజక వర్గంలో మొట్ట మొదటి ఇండస్ట్రీ ఏర్పాటు కానున్న సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపారు. తాను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇండస్ట్రీ తీసుకొచ్చి ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కలిపిస్తానని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 2023 ఎన్నికలో ఇచ్చిన హామీ గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు లింగంపల్లి గ్రామంలో టి ఎస్ ఐ ఐ సి ఇండస్ట్రియల్ జోన్ వివేక్ బయో ప్రొడక్ట్స్ శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కంపెనీ ఏర్పాటుతో నియోజక వర్గంలో నిరుద్యోగ యువతకు 250 ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజక వర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విషయం ప్రజలకు గుర్తు చేశారు. నేటి వరకు ఎల్లారెడ్డి నియోజక వర్గ సుమారు 30 వేల రైతులకు 205 కొట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలో 300 కుటుంబాలకు వచ్చే 10 రోజుల్లో డబుల్ బెడ్రూం ఇల్లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎంపీ సురేష్ శెట్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.