Take a fresh look at your lifestyle.

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు….

0 1,308

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు

రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం గ్రామంలోని రెండవ వార్డు , మూడవ వార్డు ప్రజలు గత నాలుగు రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు, రాకపోవడం వలన ప్రజలలో ఓపిక నశించి కాలి బిందెలతో రోడ్డు పైకి ధర్నాకు దిగారు. ప్రస్తుతం వాటర్ సప్లై చేస్తున్న పోచమ్మ దేవాలయం ప్రక్కన 

గల బోరు కాలిపోయి నందున దాన్ని రిపేర్ చేయించుటకు తీశారు. ఇంత వరకు బోరు రిపేరు చేయించలేదు..? అందువల్ల నీళ్ల ఎద్దడి రావడం జరిగింది. ప్రతిరోజు కనీసం త్రాగడానికి కూడా నీళ్లు రావడం లేదు, ఇంత జరుగుతున్న కనీసం గ్రామ సెక్రటరీ, ప్రత్యేక అధికారి, లేదా గ్రామ పంచాయతీ సిబ్బంది. ఈ యొక్క నీటి ఎద్దడి పై తాత్కాలిక మరమ్మత్తు ల కొరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి ఎద్దడి నీటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ యొక్క వార్డులలో మంచినీటి సౌకర్యం కోసం బోర్ మోటారు అదేవిధంగా మిషన్ భగీరథ నుండి వచ్చే నీరు సజావుగా వచ్చే విధంగా చూడాలని రెండవ వార్డు,

మూడవ వార్డు ప్రజలు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.