మహిళకు క్షమాపణ చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలి
– జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి

రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : లిక్కర్ స్కామ్ లో అరెస్టయి బెయిల్ పై విడుదల అయినంత మాత్రాన కేసు గెలిచినట్టేనా..? ఎమ్మెల్సీ కవిత ని కోర్టు నిర్దోషిగా ప్రకటించిందా..? ఎందుకు ఈ సంబరాలు? ఆర్భాటాలు, తెలంగాణ మహిళ ల పరువు ప్రతిష్టలను దేశ రాజధానిలో దిగజార్చిన, బతుకమ్మగా చెప్పుకునే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటుచేసిన ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీగా మారి కోట్ల రూపాయలు దోచుకొని, అవి సరిపోవటం లేదని టీఆర్ఎస్ పార్టీని, దేశంలో దోచు కొనడానికి బిఆర్ఎస్ పార్టీగా పేరును మార్చి దేశాన్ని దోచేశారు. ప్రజలు వీటన్నిటిని గమనించి, అసెంబ్లీ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పారు. అయినా మీ అక్రమాలు, అవినీతి, దొర అహంకార బుద్ధి తగ్గకపోవడంతో, పార్లమెంట్ ఎన్నికల్లో మీ బిఆర్ఎస్ ఉనికి లేకుండా చేసిన మీకు బుద్ధి రావటం లేదు. తెలంగాణ ఉద్యమానికి ముందు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసు, నేడు దుబాయ్ లో బూజు ఖలీఫా టవర్లో విలాస వంతమైన బిల్డింగ్ను కొనుగోలు చేయడం మీ అవినీతికి నిదర్శనం. ప్రజలు తెలంగాణను తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకుంటే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్దల లాగా మీ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు.