Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వ పథకాలు భవితకు మార్గదర్శకాలు.

0 1,243

కేంద్ర ప్రభుత్వ పథకాలు భవితకు మార్గదర్శకాలు.

బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఏముల నవీన్.

కోటగిరి , జనవరి 21 (లోకం తీరు న్యూస్) : గత తొమ్మిది ఏళ్ల పాలనలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశ యువకుల భవితకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని కోటగిరి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి వేముల నవీన్ అన్నారు.కేంద్ర ప్రభుత్వ పతకాలు ఎంతో మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి అందిస్తూ యువత తమ కాళ్లపై తాము నిలబడేలా చేయూత నిచ్చాయని పేర్కొన్నారు.కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మండలంలోని ఆయా శాఖల అధికారులు పాల్గొని వివిధ శాఖల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,వాటి ప్రయోజనాలు వివరించారు.ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఏముల నవీన్ మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచానికి జగద్గురువు గా విరాజిల్లుతుందని అన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు భారత దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకుంటున్నాయని అన్నారు.ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి,స్వచ్ఛ భారత్,ఉజ్వల యోజన,దీన్ దయాల్ అంత్యోదయ యోజన,ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎంఎన్ఆర్ఈజీఎస్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు అధికారులతో ఇబ్బందులు లేకుండా ప్రజలకు నేరుగా అందుతున్నాయని చెప్పారు. వీటితోపాటు ముద్ర లోన్లు, పీఎంఈజీపీ లోన్లు,ఇతర లోన్లు కేంద్ర ప్రభుత్వం 50శాతం వరకు సబ్సిడీతో ఎలాంటి బ్రోకరింగ్ లేకుండా బ్యాంకుల ద్వారా నేరుగా అర్హులకు అందిస్తుందని తెలిపారు. దేశంలో పేదరికాన్ని,నిరుద్యోగి తను నిర్మూలించేందుకు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని పూర్తి వివరాలు తెలియాలంటే ప్రతిఒక్కరూ నమో యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసు కుంటే అందులో కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని పథకాల వివరాలు ఉంటాయని సూచించారు.ఇంకా పూర్తి వివరాలు కావాలంటే స్థానిక బీజేపీ నేతలను సంప్రదిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివారిస్తా మని చెప్పారు.ప్రతి ఒక్కరూ కేంద్రం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాల న్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,ఎంపీటీసీ కొట్టం మనోహర్,తహశీల్దార్ ప్రభాకర్,ఎంపీడీఓ మనోహర్ రెడ్డి,ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ శివ కుమార్,హెచ్ఈఓ గోవర్ధన్,జీపీ సెక్రటరీ ముజఫ్ఫార్ బేగ్,స్థానిక నాయకులు బర్ల మధు,కట్టు రమేష్,భూమయ్య,వహీద్, బలరాం,ఆయా శాఖల అధికారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.