Take a fresh look at your lifestyle.

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

0 1,261

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 09 ( లోకంతీరు ) : జిల్లాలోని దోమకొండ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన సోనబోయిన ప్రభాకర్ కు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు శుక్రవారం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గత రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై రెండు కాళ్లకు ఆపరేషన్ అయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలుసుకున్న రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్న గారి నాగరాజ్ గౌడ్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం సంజీవరెడ్డి కి బాధితుని కుటుంబ పరిస్థితులు వివరించగా, ఆయన స్పందించి 5,000/- రూ.లు, రెడ్ క్రాస్ కామారెడ్డి డివిజన్ వైస్ చైర్మన్ పున్న లక్ష్మణ్ 3,000/- డివిజన్ కమిటీ సభ్యులు వినోద్ కుమార్ 2,000/- బాధిత కుటుంబానికి 10,000/- నగదు ఆర్థిక సహాయం అందజేసారు. ఈ కార్యక్రమంలో రాజాగౌడ్, బాబా గౌడ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.