అంగరంగ వైభవంగా ఖిల్లా రాములోరి కళ్యాణం.
- ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి..
- అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ...


నిజామాబాద్ ,జనవరి 22 (లోకంతీరు):
ప్రపంచం అంత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట సందర్బంగా నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆలయా కమిటి ఆధ్వర్యంలో ఖిల్లా శ్రీ రఘునాథ ఆలయంలో సీత, రాములోరికి అభిషేకం, అర్చన, హోమం జరిపించి అనంతరం కన్నుల పండుగగా సీత -రాముల కళ్యాణం ఘనంగా జరిపించారు. అనంతరం అయోధ్యలో జరుగుతున్నా ప్రాణహిత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లొ భక్తులతో కలిసి విక్షించడం జరిగింది, అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచం అంత రామ నామ జపం చేస్తుందని హిందూ బంధువులు అందరు మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు అన్ని ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్నా 500 ఏళ్లనాటి హిందువుల కల నేటితో సాకారం అయిందని, రాబోయే రోజుల్లో కని వినని రీతిలో ప్రపంచంలోనే మహా పుణ్యక్షేత్రం కాబోతుందని, సమస్త మానవాళికి రాముని జీవితం ఆదర్శం అని,ఆ మహా పుణ్య కార్యాన్ని మనం చూడటం మన పూర్వ జన్మ సుకృతం అని, ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకు ఈ అవకాశం లభించిందని,అయోధ్య రాములోరి కోసం ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం నేడు ఫలించింది అని, వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరింది అని అన్నారు.అంతే కాకుండా నగర ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు.ఈ సందర్బంగా ఇందూరు నుండి అప్పటి కర సేవలో పాల్గొన్న కొందరిని ఆర్ ఎస్ ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ శివాఖర్ జీ తో కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ బిజెపి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
