Take a fresh look at your lifestyle.

మారుమోగిన రామ నామం…

0 133

ఎన్జీవోస్ కాలనీలో మారుమోగిన రామ నామం

బాన్సువాడ ,  జనవరి 22 ( లోకంతీరు ) : బాన్సువాడ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎల్ఈడి ఏర్పాటు చేసి భక్తులకు లైవ్ టెలికాస్ట్ ద్వారా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి పండుగను అందరం కలిసి ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటామని, అంతా ఒకచోట కలిసి అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్టను వీక్షించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.