బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి.
- పోతంగల్ ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమలత.
- పొతంగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల దినోత్సవం.
కోటగిరి, జనవరి 24 (లోకం తీరు ) : బాలికలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలని పోతంగ ల్ ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమలత అన్నారు.బుధవారం పొతంగల్ మండల కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలి కల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతు.బాలికలు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో ముందుం డాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల ప్రవేశ పెట్టిన చట్టాలతో బాలికల అభ్యున్నతికి తోడ్పడు తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వర్ని శంకర్,డిప్యూటీ డిఎంహెచ్ఓ విద్య, పోతంగల్ సింగిల్ విండో చైర్మన్ శాంతేశ్వర్ పటేల్, వైస్ చైర్మన్ గంధపు పవన్,ఎంపిటిసి కేశవ వీరేశం, పోతంగల్ ఎమ్మార్వో రమేష్,ఉమ్మడి కోటగిరి మండలం ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్,కోటగిరి ఐసిడిఎస్ సూపర్వైజర్ మణి,పలువురు ప్రజా ప్రతినిధులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.