అయోధ్య లో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట స్ఫూర్తిగా..
- మోడీ స్ఫూర్తి గా రామునికి పందిరి వేసిన యువకులు..
- శ్రీ రాముని మదిలో నిలిచిన యువకులు..
- అభినందించిన చుట్టూ పక్కన గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు
త్వరలోనే గుడి నిర్మిస్తాం..

దర్పల్లి ,జనవరి 22 ( లోకంతీరు) :
యువత తల్చుకుంటే ఎదైన సాధిస్తారు. ఎంతటి కార్యాన్నైనా జయిస్తారు. అయోధ్యలో శ్రీ రామునికి ప్రతిష్ట చేస్తున్న సందర్భాన్ని పుర్కరించుకొని దర్పల్లి మండలం వాడి గ్రామ యువకులు మోడీ ని, అయోధ్య ఆలయాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిలువ నీడ లేకుండా ఉన్న శ్రీ రామ, లక్ష్మణులకు పందిరి వేసి డాడెం రవి, చేలిమెల రాకేష్,గంగాదాస్ , ప్రసాద్, వంశీ, కార్తిక్, రంజిత్, నరేష్, సాయి కుమార్, రాజీవ్, మోహన్, యోగి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం అంజన్న మాల వేసుకునే యువకులు ఎలాగైన ఈ రోజు రాముని కి పందిరి వేయాలని దృడ సంకల్పంతో పూర్తి చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు చేసిన మంచి పనిని చూసి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుందేళ్ళ ప్రభు, గ్రామ ప్రజలు కర్క రమేష్, భాస్కర్, సాగర్, నవీన్ , శ్రీకాంత్, లింగాపురం సాయిలు, మోహన్ రెడ్డి, గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, సాయిలు తదితరులు అభినందించారు. శభాష్ యువకులు శభాష్ అంటూ ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా అభినందిస్తున్నారు.త్వరలోనే గుడి నిర్మిస్తామని యువకులు తెలియజేశారు. ఎది ఏమైన పురాణాల్లో శబరి రామునికి గుడి లేదని తన ఇల్లు పై కప్పు తీసేసి వర్షంలో తడుస్తూ భక్తిని చాటితే ఈ యువత ఊరకే చూస్తూ కుర్చొక రామునికి పందిరి వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఫేస్ బుక్, వాట్సప్ ద్వారా తెలుసుకొని గుడిని చూడడానికి పక్క గ్రామాల నుంచి భక్తులు వచ్చి యువతను అభినందిస్తున్నారు.