నిషేధిత అల్పోజోలం పట్టివేత
– ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్ రవీందర్ రాజు

కామారెడ్డి జిల్లా ,జనవరి 24 (లోకం తీరు) : నిషేధిత మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతున్న ఎక్సైజ్ శాఖ,కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి ఎస్ రవీందర్ రాజు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎన్ డి పి ఎస్, కామారెడ్డి ఎక్సైజ్ వారు సంయుక్తంగా జరిపిన దాడుల్లో మున్సిపల్ పరిధిలోని రంగ శ్యామ ప్రసాద్ గౌడ్ ఇంటిలో 840 గ్రాములు పట్టుబడినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి మరొక వ్యక్తి కోసం గాలింపులు కొనసాగుతున్నాయని కామారెడ్డి ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా లో మత్తుపదార్థాల రవాణా ఏ రూపంలో జరిగిన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ దాడుల్లో డిటిఎఫ్ సిఐ సుందల్ సింగ్, కామారెడ్డి సీఐ విజయ్ కుమార్, ఎస్సై విక్రమ్ కుమార్, వారి సిబ్బంది పాల్గొన్నారు.