Take a fresh look at your lifestyle.

15వ ఆర్థిక సంఘం నిధుల సమీక్ష సమావేశం…..

0 1,640

15వ ఆర్థిక సంఘం నిధుల సమీక్ష సమావేశం

– జడ్పీ చైర్పర్సన్ శోభ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 15 వ ఆర్ధిక సంఘం నిధుల క్రింద చేపట్టవలసిన పనులపై రూపొందించిన ఆర్థిక ప్రణాలికను సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ధఫెదర్ శోభ అన్నారు. శనివారం కలెక్టర్ లోని ప్రధాన సమావేశ మందిరంలో 2024-25 సంవత్సరంలో 15 ఆర్ధిక సంఘం క్రింద వచ్చిన 2 కోట్ల 90 లక్షల 4 వేల తో చేపట్టవలసిన పనులపై జిల్లా పరిషద్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా పరిషద్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జెడ్పి ముఖ్య కార్యనిర్వహణాధికారి సాయ గౌడ్, జెడ్.పి .టి.సి . సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భముగా శోభ మాట్లాడుతూ 15వ ఆర్ధిక సంఘం నిధులలో 60 శాతం టైడ్ గ్రాంట్ గా కోటి 74 లక్షల 2 వేలతో పారిశుద్యం, మంచినీటి పనులు చేపట్టుటకు సభ తీర్మానించిందని అన్నారు. అదేవిధంగా 40 శాతం అన్ -టైడ్ గ్రాంట్ క్రింద కోటి 16 లక్షల 2 వేల రూపాయలతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, గ్రంధాలయాలు, శౌచాలయాలు, కిచెన్ షెడ్లు, ఆర్.ఓ. ప్లాంట్లు, సి.సి. రోడ్ల వంటి పనులు చేపట్టుటకు జిల్లా పరిషద్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ ప్రతిపాదిస్తూ తీర్మానము ప్రవేశ పెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.