విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి

కామారెడ్డి జిల్లా రాజంపేట, ఆగస్టు 23 (లోకంతీరు) : రాజంపేట మండలం అన్నారం తండా గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో శుక్రవారం యువకుడు మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పక్కన పొలం ఉన్న వారు అటవీ పందుల నిమిత్తం విద్యుత్ను అమర్చారు. అటుగా వెళ్లిన బాణోత్ తిరుపతి తండ్రి పిరియా వయస్సు 33 విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజంపేట ఎస్సై పుష్ప రాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాజంపేట పోలీసులు తెలిపారు.