Take a fresh look at your lifestyle.

భారతీయ ఆదివాసి వీర యోధుని వర్ధంతి

0 1,690

భారతీయ ఆదివాసి వీర యోధుని వర్ధంతి 

* అస్సాం హక్కుల దివిటీ శంభుధన్ పొంగ్లో
* ఫిబ్రవరి 12న వర్ధంతి ప్రత్యేకం
* ఆదివాసీల రచయిత వేదిక గుమ్మడి లక్ష్మీనారాయణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 11 ( లోకంతీరు) : వీర్ సెంగ్యా శంభుధన్ ఫోంగ్లో మరుగున పడిన ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. అతను బ్రిటిష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ ఆదివాసీ వీరయోధుడు. అతను అస్సాంలోని ప్రస్తుత దిమా హసావో జిల్లాలోని ఉత్తర కాచర్ హిల్స్ లోని లాంగ్ ఖోర్ అనే చిన్న గ్రామంలో 1950, మార్చి16న జన్మించాడు. బాల్యం నుండి శంభుధన్ ఎల్లప్పుడూ తన ప్రజల సంక్షేమం గురించి శ్రద్ధ వహించేవాడు. పర్యవసానంగా, 1832లో బ్రిటిష్ వారు కాచర్ను స్వాధీనం చేసుకున్నప్పుడు, అతను చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అతను డిమాసా భూభాగాన్ని బ్రిటిష్ వారు  ఆక్రమించడమే కాకుండా ‘ విభజించు – పాలించు ‘ వ్యూహాన్ని అమలు చేశారు. ఈ చర్యను బ్రిటిష్ ద్రోహంగా భావించాడు పొంగ్లో. భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారు అక్కడి స్థానికుల హృదయాలను కూడా గెలుచుకోలేకపోయిన విషయాన్ని పొంగ్లో గమనించాడు. ఇవి బ్రిటిష్ పాలనపై క్రమంగా తిరుగుబాటుకు దారితీసింది.

1832లో బ్రిటీష్ వారు సదరన్ క్యాచర్ను మరియు 1854లో ఉత్తర కాచరును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫోంగ్లో ఈ చర్యలను వ్యతిరేకించాడు. అస్సాం ప్రజలను పాలించే హక్కు బ్రిటీష్ వారికి లేదని, స్వదేశీయులను నిర్వీర్యం చేసేందుకే ప్రాదేశిక ఎత్తుగడలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్వదేశీ ప్రజలు స్వేచ్ఛను కోల్పోతే సాహించేది లేదని హెచ్చరించాడు. స్వేచ్ఛను కోల్పోవడం అంటే బానిసత్వాన్ని స్వీకరించడం కదా! అని ఆవేశపడ్డాడు. కష్టాలను భరించవచ్చు కానీ బానిసత్వం అలా కాదు. అస్సాం ప్రజలు బానిసలుగా విదేశీయుల క్రింద జీవించడం ఆత్మగౌరవం కాదు. ఒక విదేశీ శక్తి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో ప్రజలెవరు వారికి సహకరించకూడదని పుంగ్లో అభిప్రాయ పడ్డాడు. ప్రజలను నిరసనలు తెలపడానికి మరియు అధికారులను ప్రతిఘటించడానికి అతను ఉత్తర కాచర్ హిల్స్ గుండా విస్తృతంగా పర్యటించాడు. దారి పొడవునా పరిచయాలు, మద్దతుదారులను కూడగట్టుకున్నాడు.
ఫోంగ్లో తగినంత మంది యువకులను సేకరించి ఒక విప్లవ శక్తులను రూపొందించినప్పుడు, అతను మైబాంగ్లో వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. బ్రిటీష్ ప్రభుత్వం శంభుధాన్ కార్యకలాపాల గురించి తెలుసుకొని చాలా ఆందోళన చెందింది. సైన్యం కూడా కఠినంగా స్పందించింది. గుంజుమ్ సబ్ డివిజనల్ అధికారి శంభుధన్ ను పిలిపించి అతని పేరు మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతడిని అరెస్టు చేసేందుకు సైన్యాన్ని మైబాంగ్ కు పంపించారు. శంభుధన్ కి ఇది గాలి వచ్చినప్పుడు, అతను తన సైన్యాన్ని ఏర్పాటు చేసి మైబాంగ్ లోని తన శిబిరంపై దాడి చేసిన బ్రిటిష్ అధికారులను చంపాడు. తదుపరి ఎన్ కౌంటర్లలో, బ్రిటీష్ సైన్యం శంభుధాన్ కూడగట్టుకున్న బలాన్ని మరియు శక్తిని పసిగట్టింది. చివరికి, బ్రిటీష్ వారు అతనిని ద్రోహపూర్వకంగా ఓడించారు. అతను నార్త్ కాచర్ హిల్స్ లోని లోతైన అడవిలో పట్టుబడి, బ్రిటిష్ సైన్యం దాడికి గురయ్యాడు. అక్కడి అడవిలోనే లోతైన గాయాలతో పొంగ్లో 1883, ఫిబ్రవరి 12న  శంభుధన్ పొంగ్లో మరణించాడు.

Leave A Reply

Your email address will not be published.