మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతం

కామారెడ్డి జిల్లా /రాజంపేట,అగస్టు 21 (లోకంతీరు): సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ తీర్పు పట్ల నిరసనగా రాజంపేట మండల కేంద్రంలో భారత్ బంద్ పిలుపులో భాగంగా శివాయిపల్లి, పొందుర్తి, ఆరేపల్లి, తలమడ్ల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మరియు వాణిజ్య సంస్థలు బుధవారం బంద్ మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, వర్గీకరణ పోరాట సమితి కన్వీనర్ ఎడ్ల రాజు, సుతారి సుధాకర్, రవిందర్, కృష్ణ, నాలుక స్వామి, తదితరులు పాల్గొన్నారు.