Take a fresh look at your lifestyle.

పుల్లూరు బండ జాతర ఘనంగా నిర్వహించాలి..మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు ..

0 1,721

పుల్లూరు బండ జాతర ఘనంగా నిర్వహించాలి….

జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి…

– పుల్లూరు నారసింహ క్షేత్రాన్ని సుమారు మూడున్నర కోట్లతో పలు అభివృద్ధి చేశాం..

– భవిష్యత్ లో మరింత అభివృద్ధి చేస్తా …

– మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు ..

– హరీష్ రావు కు జాతర ఆహ్వాన పత్రాన్ని అందజేసిన దేవాలయ వంశ   

  పారంపర్య అర్చకులు, గ్రామ నాయకులు..

సిద్దిపేట, ఫిబ్రవరి  07 ( లోకంతీరు ) : ఈనెల 9 నుండి జరిగే సిద్దిపేట మండలం పుల్లూరు బండ జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు సూచించారు.. దేవాలయ వంశ పారాంపర్య అర్చకులు, గ్రామ నాయకులు బుధవారం హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసం లో పుల్లూరు బండ జాతర ఆహ్వాన పత్రికను హరీష్ రావుకు అందజేశారు. ఈ నెల 9 నుండి 11 వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయని హరీష్ రావుకు వివరించారు.. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.. భక్తులకు 24 గంటలు మంచినీటి వసతి.. అత్యవసర సమయాల్లో చికిత్స అందించెందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు.. బండపై ఉన్న గుండాల్లో స్నానాలు చేసే భక్తులకు ప్రమాదం జరుగకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.. భక్తుల దర్శనం కోసం అవసరమైన క్యూ లైన్లు.. ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పారు.. విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం చాలా గొప్పదని ఇక్కడ నరసింహ స్వామి స్వయంగా వెలిశాడని అన్నారు. దేవాలయాన్ని ఇప్పటికే సుమారు మూడున్నర కోట్ల రూపాయల తో అభివృద్ధి చేశామని తెలిపారు. బంధాపైకి వాహనాలు వెళ్లడం కోసం 35 లక్ష ల రూపాయల తో సీసీ రోడ్డు నిర్మింప జేశామని చెప్పారు.. 35 లక్షల టీటీడీ నిధులతో దేవాలయాన్ని పునరుద్దరింప జేశామన్నారు.10 లక్షల రూపాయల తో దేవాలయం చుట్టూ షెడ్ నిర్మింప చేశామన్నారు.. బండ పై మంచినీటి సమస్య ను శాశ్వతంగా దూరం చేయడం కోసం 80 లక్షల రూపాయల తో మిషన్ భగీరథ పథకం లో భాగంగా 1 లక్ష 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు ను నిర్మింపజేశామని చెప్పారు.50 లక్షల రూపాయల తో బండపై కళ్యాణ మండపం నిర్మించామని చెప్పారు. సుమారు 20 లక్షల రూపాయల తో బండ పై సుడా పార్క్ ను నిర్మించామని చెప్పారు. మరో 8 లక్షల రూపాయల తో బండపై మినీ ట్యాంకు లు, పైప్ లైన్లు.. భక్తుల కోసం నల్లాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బంధాపైకి సీసీ రోడ్డు గుండా సుమారు 10 లక్షల రూపాయల తో విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పుల్లూరు గ్రామ స్టేజీ వద్ద సుమారు 15 లక్షల రూపాయల తో దేవాలయ నిర్మించామని చెప్పారు.మరో 50 లక్షలు మంజూరు అయ్యాయని ఆ నిధులతో దేవాలయం కు వచ్చేభక్తుల సౌకర్యం కోసం ధర్మ శాలలు నిర్మింప చేస్తామని చెప్పారు.

భవిష్యత్ లో మరిన్ని నిధులు కేటాయించి దేవాలయాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేస్తామని హరీష్ రావు చెప్పారు.జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు హరీష్ రావుకు దేవాలయ వంశ పారంపర్య అర్చకులు కలకుంట్ల రంగాచార్య, పొడిచేటి రామకృష్ణ, గ్రామ తాజా మాజీ సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్, గ్రామ ఎంపీటీసీ సభ్యులు కుంచం లత వెంకట్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ ప్రసాద్ రెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మల్లేశం , నాయకులు కనకం మల్లేశం.. గ్రామ టిఆర్ ఎస్ వి నాయకులు గరిపల్లి వినయ్ పురోహితుడు సుబ్రహ్మణ్యం.. తదితరులు ఆహ్వాన పత్రికను అందచేశారు.

Leave A Reply

Your email address will not be published.