నిజాం సాగర్ కాలువల పూడిక తీయిస్తా.
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి.

బాన్సువాడ/కోటగిరి, జనవరి 28 ( లోకం తీరు ) : నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న డిస్ట్రిబ్యూటర్ కెనాళ్లలో పూడికను తీయిస్తానని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సాగర్ ఆయకట్టు రైతులకు హామీ ఇచ్చారు.ఆదివారం పోతంగల్ మండలంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ డి 28/1 ను ఏనుగు రవీందర్ రెడ్డి పరిశీలించారు. పోతంగల్ చెక్పోస్ట్ నుండి సుంకిని వరకు గల ఈ కాల్వ పూడికను పరిశీలించిన ఆయన వెంటనే పూడిక తీయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.కెనాల్ వెంట స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి బైక్ పై తిరుగుతూ కాలువను పరిశీలించి అనంతరం రైతులతో హెగ్డోలిలో సమావేశం అయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
సాగర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా కృషి చేస్తానని అన్నారు.కెనాల్ లో పూడికను వెంటనే తీయించి సుంకిని వరకు నీళ్లు అందేలా చూస్తానని చెప్పారు.కెనాల్ చివరి ఆయకట్టు ప్రాంతమైన కొల్లూర్,రాం గంగా నగర్,సోంపూర్, గ్రామాల రైతుల పొలాలకు సైతం సాగునీరు అందించేందుకు మరో రెండు కిలోమీటర్ల మేర కాలువను సిసి చేయాల్సి ఉందని వెంటనే అధికారులతో ఎస్టిమేషన్ వేయించి ఆ పనులు పూర్తి చేయిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. కాలువ పూడిక తన సొంత ఖర్చులతో అయినా తీయించి రైతులకు సాగునీరు అందిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్,కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్,కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్,డిసిసి ఉపాధ్యక్షుడు గంగాధర్ దేశాయ్,మీర్జాపురం చిన్న సాయన్న, ప్రతాప్ సింగ్,హనుమంతు,హనుమంతరావు పటేల్,శ్రీనివాస్ గౌడ్,గంధపు దత్తు,ధనరాజ్, రైతులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.