వాహనాల తనిఖీ

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి జులై 29 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సోమవారం ఎస్సై యాసిర్ ఆరాఫత్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీచేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు వాహనాలు ఆపి సరి అయిన పత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాల గురించి వివరించారు. కానిస్టేబుళ్లు సదానంద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.