మొక్కలు నాటారు రక్షణ మరిచారు…?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , జూలై 28 ( లోకంతీరు ) : గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి దుర్గా నగర్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర డివైడర్ను నిర్మించడం జరిగింది. ఈ డివైడర్ కు సెంట్రల్ లైటింగ్ తో పాటు రెండు రోజుల క్రితము మండల అధికారులు దాదాపు 200 మొక్కలను నాటడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నాటిన మొక్కలకు రక్షణ లేక మేకలు మేస్తున్నాయి. ప్రజాధనంతో నాటిన మొక్కలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు.