గావ్ చలో అభియాన్ కార్యక్రమంలొ పాల్గొన్న..
– అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…
– పాఠశాల అభివృద్ధి కొరకు ట్రస్ట్ ద్వారా నిధులు.

నిజామాబాద్ , ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : ఇందూర్ పట్టణం దుబ్బ ప్రాంతంలో 38 డివిజన్ లొ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. మొదట దుబ్బ హై స్కూల్ సందర్శించారు. స్కూల్ లో ఉన్న మౌలిక సౌకర్యలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ లొ బెంచీలు, ఫాన్స్, టాయిలెట్స్ సమస్యలు ఉన్నాయని విద్యార్థులు తెలుపగ,ఎమ్మెల్యే స్పందిస్తూ తన ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో బెంచీలు, ఫాన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గం లొ ఉన్న ప్రభుత్వ పాఠశాలల సమస్యల పై ఇంచార్జి మినిస్టర్ తో మాట్లాడి నియోజకవర్గ నిధుల ద్వారా వాటిని త్వరతగతిన పూర్తి అయ్యేలా చూస్తానని అన్నారు. అనంతరం డివిజన్ లొ ఏలమ్మ దేవాలయం ను స్థానిక నాయకులతో కలిసి దర్శించుకోని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దళిత బస్తిలో కులపెద్ద గంగయ్య ఇంట్లో తేనిటీ విందులో పాల్గొని బస్తి పెద్దమనుషులతో మాట్లాడి కాలనిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక బిజెపి నాయకులతో సమావేశామై కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం తీసుకొచ్చిన అనేక పథకాలను ఇంటింటికి తీసుకుపోవాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అర్బన్ నుండి అత్యధిక మెజారిటీ తీసుకురావాలని లక్ష ఓట్లు టార్గెట్ పెట్టుకొని కార్యకర్తలు కష్టపడి పని చేయాలనీ సూచించారు. ఇందూర్ పార్లమెంట్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించి నరేంద్రమోడీ కి బహుమతి గా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమం లొ బిజెపి జిల్లా ఉప అధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గడ్డం రాజు, కార్పొరేటర్ ప్రవళిక శ్రీధర్, బీజేపీ నాయకులు రంజిత్, భాస్కర్ శివునూరి, బట్టి కిరి ఆనంద్, చింతకాయల రాజేందర్ గట్ల గంగాధర్ రామడుగు భగత్, కార్యకర్తలు బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.