Take a fresh look at your lifestyle.

పోచారం ప్రాజెక్టుకు జల కళ…….

0 118

పోచారం ప్రాజెక్టుకు జల కళ

– భారీగా వచ్చి చేరుతున్న వర్షపు నీరు

– జలకళను సంతరించుకుంటున్న చెరువులు,

– పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు

– అలుగు పై నుంచి పారుతున్న పోచారం ప్రాజెక్ట్

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపిడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతలైన గుండారాం,లింగంపేట్ వాగుల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పోచారం ప్రాజెక్ట్ జల కళను సంతరించుకుంది. దింతో చెరువులు, వాగులు జలకళను సంతరించుకుంటున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాలనుంచి గుండారం, వాగుల ద్వారా పోచారం ప్రాజెక్ట్ లోకి 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరి అలుగుపై నుంచి పొంగి పోర్లి మంజీరా నదీ కాలువ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి ప్రవేశిస్తుందని ఇరిగేషన్ డిఇ వెంకటేశ్వర్లు తెలిపారు. పోచారం ప్రాజెక్ట్‌ ఆ వరద ఉధృతితో నిండి జలకళ ను సంతరించుకుంది.దింతో పర్యాటకుల సందడి నెలకొంటోంది. వాగులు, వంకలు వరద ప్రభా వంతో ఉధృతంగా ప్రవాహిస్తున్నాయి. ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సీజన్‌లో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చెరువులకు జలకళ

మండలంలోని పలు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండంలోని పలు చెరువులు, కుంటలు నీటితో నిండుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సీజన్‌లో వర్షం జోరుగా కురుస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురవడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వానాకాలం పం టలకు ఇక డోకాలేదని ఆయా కట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అలుగు దూకిన గంగమ్మ

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చెరువుల్లోని గంగమ్మ అలుగు దూకుతోంది. జులై మొదటి వారంలో కురిసిన వర్షాలకు చెరువుల్లో వరుద నీరు వచ్చి చేరింది. దీనికి తోడు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కాస్త పూర్తిగా నిండుకొని అలుగులు పోస్తున్నాయి. మొన్నటి వరకు నీరు లేక బోసిపోయిన పోచారం ప్రాజెక్ట్ చెరువు నిండుకుండలా కనిపిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అలుగు పారుతుండటంతో జలకళను సంతరించుకుంది.

ప్రాజెక్ట్ ను పరిశీలించిన అధికారులు

పోచారం ప్రాజెక్టు నిండి నిండుకుండల ప్రవహించడంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు.ఆదివారం జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్,ఎల్లారెడ్డి ఆర్డివో మన్నే ప్రభాకర్ లు సందర్శించి పర్యవేక్షించారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరంమైతే తప్ప బయటకు రావద్దని చేపల వేటగాళ్లు వేటకు వెళ్ళద్దని రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు,తీగలకు దూరంగా ఉండాలని వారు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.