వేల్పూర్ లో డీజేలు నిషేధం.
– వీడీసీ తీర్మానం.

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 30 ( లోకంతీరు ) : వేల్పూర్ మండలం కేంద్రంలో జూలై 30 సెప్టెంబర్ లోజరిగే వినాయక ఉత్సవాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగే డీజేలను పెట్టరాదని వేల్పూర్ గ్రామ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. మంగళవారం వివిధ కుల సంఘాల యూత్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షుడు విజేయ్ మాట్లాడుతూ,ఇతరులకు ఇబ్బంది కలిగించే డీజేలను వాడరాదని, తక్కువ పోల్యూషన్ ఉన్న డిజే లనే ఉపయోగించాలి, అలాగే అర్ధ నగ్నంగా డ్యాన్స్ చేసే వారిని సంప్రదించవద్దు, బలవంతపు చందాలు వసూలు చేయరాదని, భక్తి శ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించాలని విడిసి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో విడిసి సభ్యులు సంఘంలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..