బాధిత కుటుంబాలకు సహాయం

రామారెడ్డి, సెప్టెంబరు 01 ( లోకంతీరు ) : మండల కేంద్రంలో అకాల వర్షం కారణంగా కొందరి ఇళ్లలోకి వర్షపు నీరు చేరడం వలన వారిని మానవతా దృక్పథంతో నిరాశ్రయులైన కుటుంబాలను కమ్యూనిటీ హాలులో, పాఠశాలలో వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు తినడానికి ఉదయం అల్పాహారం అందించారు. అదేవిధంగా స్వచ్ఛందంగా 5:30 బ్యాచ్ సభ్యులు వంటలు చేసి వారికి ఆహారాన్ని అందించి ఆకలిని తీర్చారు. బాధిత కుటుంబాలు కొందరు గ్రామస్తులు దుప్పట్లను, బట్టలు, నిత్యవసర వస్తువులు, సహాయ సహకారాలు అందించారు. ఇలాంటి సందర్భంలో వెంటనే స్పందించిన యువతకు, గ్రామంలోని స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.