వర్షానికి కూలిన ఇల్లు

ఎల్లారెడ్డి , సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : రాత్రి నుంచి ఎడతెడపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో బీభత్సం సృష్టించింది. ఈ భారీ వర్షానికి పట్టణంలో పలు కాలనీలో ఇండలోకి వర్షపు నీరు వచ్చి చేరాయి. పట్టణంలోని ఎనిమిదవ వార్డుకు చెందిన కమ్మరి అనసూయ చెందిన ఇల్లు భారీ వర్షంతో ముందు భాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఇల్లు కూలిన ప్రదేశంలో ఎవరు లేకపోవడంతో ప్రాణా భయం తప్పింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని శిథిలావస్థకు ఉన్న ఇళ్లలో ఉండకూడదని సూచించారు.