బాధిత కుటుంబానికి పరామర్శించి ఆర్థికసాయం అందజేత
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా

ఎల్లారెడ్డి, నవంబర్ 04 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట గ్రామానికి చెందిన సింగసాని గంగారం గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా వారి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ప్రగడ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్ఫూర్తితో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో గోస్కె గణపతి, కోర్వి ఎల్లప్ప, నీరడి హన్మాండ్లు, కొయ్యల రాజగౌడ్, కర్రెచెవుల రాజు, పెంట అంజయ్య, పెంట నారాయణ, కమ్మరి భాస్కర్, గౌలపల్లి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.