Take a fresh look at your lifestyle.

వాహనాల దొంగల అరెస్ట్….కామారెడ్డి జిల్లా

0 1,865

వాహనాలు దొంగతనం చేసే దొంగల ముఠా అరెస్ట్..

– జిల్లా ఎస్పీ సింధు శర్మ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) : కామారెడ్డి చుట్టుపక్కల ఏరియాలలో వరుస మోటార్ సైకిల్ దొంగతానలు జరుగుతున్నందున, కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ శర్మ, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సూచనలతో, డి.ఎస్.పి ప్రకాష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో, కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సిసిఎస్ సి‌ఐ, యస్‌.ఐ మరియు సిబ్బందిబృందాలుగా ఏర్పడి నేరస్తులను పట్టుకోవడానికి, ప్రయత్నాలు చేస్తుండగా, నమ్మదగిన సమాచారం మేరకు ఈనెల 08 న కామారెడ్డి పట్టణంలో నిజాంసాగర్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదముగా బండిపై వచ్చిన ముగ్గురు నేరస్తులను పోలీసులు ఆపి వాహన సంబందిత కాగితాలను చూపించమనగా, అట్టి నేరస్తులు పోలీసు వారి నుండి తప్పించుకొనే ప్రయత్నము చేయగా, వెంటనే పోలీసు వారు పట్టుకొని విచారించగా, తాము మొత్తం (29) బైక్ లను కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో పలుచోట్ల దొంగతనాలు చేసినట్లుగా నేరాలను ఒప్పుకున్నారు. నిజాంపూర్ శంకర్ ( 19), యారు గట్ల సందీప్(26), షేక్ అహ్మద్(28) గా గుర్తించారు. వీరు పై ఉమ్మడి జిల్లాలలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయాన్ని తెలిపారు.వీరు నేరాల ను ఒప్పుకున్నందున కేసు నమోదు చేయడం జరిగిందని ఇట్టి మొత్తం 29 మోటార్ సైకిల్స్ విలువ సుమారు రూ. 40,00,000/- వరకు ఉంటుంది.

వీటిలో 12 బుల్లెట్ బండ్లు, 12 పల్సర్ బండ్లు, 1 ఆక్టివ బండి, 1 గ్లామర్ బండి, డీలక్స్ బండి, 1 స్ప్లెండర్ బండి, 1 టి‌వి‌ఎస్ స్టార్ సిటి బండి కలవు. ఇకపై ఎవరైనా కామారెడ్డి జిల్లాలో నేరం చేయడానికి ప్రయత్నిస్తే గాని లేదా నేరం చేస్తే గాని వారిని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సీసీ టీవీ ఫుటేజ్, ఇన్ఫార్మర్ ల ద్వారా సమాచారం సేకరించి ఖచ్చితంగా నేరస్తులను వెంబడించి పట్టుకుంటామని, అదేవిధంగా నేరస్థులను కోర్టు ముందు ప్రవేశ పెట్టి కచ్చితంగా వాళ్లకు శిక్షలు పడే విధంగా చేస్తామని అన్నారు.ఈ కేసులను అతి తక్కువ సమయములో చాకచఖ్యముగా వ్యవహరించి ఛేదించిన కామారెడ్డి పట్టణ సిఐ చంద్ర శేఖర్ రెడ్డి ని, సి‌సి‌ఎస్ సి ఐ మల్లేశ్ గౌడ్, శ్రీనివాస్, ఎస్ ఐ లు ఉస్మాన్, శ్రీరామ్, సిబ్బంది రాజేశ్వర్, సురేందర్, సయీద్, కిషన్, గణపతి, శ్రవణ్, రాజేందర్, కర్ణాకర్, రాజు, విశ్వనాథ్, రమేశ్, నరేశ్, భాస్కర్, రవి, నవీన్ లను జిల్లా ఎస్‌పి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.