Take a fresh look at your lifestyle.

ర్యాంకుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ కాలేజీలు…..

0 1,231

ర్యాంకుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ కాలేజీలు

నిజామాబాద్, నవంబర్ 23 ( లోకంతీరు ) :  కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని డిమాండ్ చేస్తూ పీ.డీ.ఎస్.యు. ఆధ్వర్యంలో కోటగల్లి, ఎన్.ఆర్. భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. ఈరోజు హైదరాబాద్ శ్రీచైతన్య విద్యార్థి కౌశిక్ రాఘవ ఆత్మహత్య చేసుకుని మరణించడానికి కాలేజీ యాజమాన్య ఒత్తిడే కారణమన్నారు. శ్రీ చైతన్య నారాయణ తదితర కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం విద్యార్థులపై అధిక ఒత్తిడిని కలిగిస్తూ వేధిస్తున్నాయాన్నారు. మార్పులు ర్యాంకుల కోసం కార్పొరేట్ కాలేజీల వేధింపులను తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వరుసగా ఈ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ ఏసు నమో చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ నాణ్యమైన భోజనం, కనీస సౌకర్యాలు కల్పించకుండా, కేవలం చదవడం పైనే ఒత్తిడి చేస్తూ విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు కూడా మార్కులు ర్యాంకులే ముఖ్యమైనట్టుగా భావిస్తుండడం బాధాకరమన్నారు. విద్యార్థుల్లో చదువుతోపాటు క్రీడలు, మానసిక ఉల్లాసము అవసరమన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీల ఆగడాలను నియంత్రించకపోతే మరిన్ని ఘటనలు జరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న కార్పొరేట్ కాలేజీలల్లో వెంటనే తనిఖీలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలను మూసివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు నగర ఉపాధ్యక్షులు మహిపాల్, నాయకులు నశీర్, సమీర్,శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.