పీఆర్టీయూ మండల అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్

బాల్కొండ ప్రతినిధి నియోజకవర్గం, ఆగస్టు 24 ( లోకంతీరు ) : ముప్కాల్ పీఆర్టీయూ మండల అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు సామ ప్రసాద్ శనివారం రోజు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా కొండ్రు నవీన్, మండల అసోసియేట్ అధ్యక్షులుగా జి.రవి కుమార్, మండల కార్యదర్శిగా జి.రాజేశ్వర్, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఇంద్ర లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ కార్యవర్గంకు తోటి ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముందుంటానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.