Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.

0 33

                                                                                                                              సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.                                                                                                                        భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.
335 మందికి కారుణ్య నియామక పత్రాల పంపిణీ.
ఉద్యోగ కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూన్ 13: సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడం, బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, ఉద్యోగ అవకాశాలను విస్తరించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కారుణ్య నియామకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వం సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా పద్మవినాయక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తదితరులతో కలిసి 335 మంది అభ్యర్థులకు సింగరేణి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందని, సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు అందుకోవడం వల్ల బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుందని చెప్పారు. అర్హులైన కుటుంబాలకు కారుణ్య నియామకాలు త్వరితగతిన అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఉద్యోగ కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ సింగరేణి అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, గత పాలనలో సింగరేణి సంస్థలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలు, పరిపాలనా లోపాలు, అప్పుల భారం వంటి సమస్యల నుంచి సంస్థను గట్టెక్కించేందుకు ప్రస్తుత ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకు సాగుతోందని అన్నారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ, వివిధ శాఖల అధికారులు, ఐఎన్‌టీయూసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కారుణ్య నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.