Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం మాఫీ చేసిన రుణం డబ్బులు రైతులకు అందరికి అందాలి….

0 1,263

ప్రభుత్వం మాఫీ చేసిన రుణం డబ్బులు రైతులకు అందరికి అందాలి

– మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు

కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు )కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి లో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం రైతుల పేరిట బ్యాంకుల్లో తీసుకున్న డబ్బులు మాఫీ కావడంతో ఆ డబ్బులు రైతులకే ఇవ్వాలని మాజీ జెడ్పిటిసి బారాస సీనియర్ నాయకుడు పడిగెల రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం తమ రుణమాఫీ అయిందని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం తమకు తెలియకుండానే మా పేర్లపై రుణం తీసుకుందని రుణమాఫీ అయినట్టు తమకు సమాచారం వచ్చిందని వెంటనే డబ్బులను తమకే ఇప్పించాలని అడ్లూరు ఎల్లారెడ్డి, పోసానిపేట్, సదాశివనగర్, మర్కల్, కుప్రియాల్ గ్రామాల రైతులు రాజేశ్వరరావు ను కోరారు.
ఈ విషయంపై స్పందించిన మాజీ జెడ్పిటిసి న్యాయంగా రైతులకు చెందవలసిన డబ్బులు యజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇప్పటికే దాదాపు వందలాది మంది రైతుల పేరిట ఫ్యాక్టరీ యాజమాన్యం రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడ యూనియన్ బ్యాంకు లో రైతుల పేరిట ఋణం పొందినట్లు సమాచారం వచ్చిందని మాజీ జెడ్పిటిసి తెలిపారు. ఫ్యాక్టరీ యజమాన్యం వెంటనే మాఫీ అయిన డబ్బులను రైతులకు చెక్కుల ద్వారా అందజేయాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు నాయకుడు కళాలి సాయ గౌడ్, భారాస సీనియర్ నాయకుడు లింబాద్రి నాయక్, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆశ మహేష్, రైతులు కుమ్మరి రాజలింగం, సంజీవరెడ్డి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.