గోవింద నామస్మరణలతో మార్మోగిన లింబాద్రి గుట్ట


భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 03 (లోకం తీరు): దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలిసిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్టపై శనివారం నాడు గోవిందా నామస్మరణలతో మార్మోగింది. భక్తులు దైవదర్శనం కోసం బారులు తీరారు.చుట్టుపక్కల గ్రామాల భక్తులే కాకుండా దూరప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు.దైవదర్శనం కోసం గంటల తరబడి నిలబడి దర్శనం చేసుకొని,మొక్కులు తీర్చుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి స్వామివారికి పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు.అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా భీంగల్ ఎస్ఐ హరిబాబు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.