ఘనంగా వసంత పంచమి నిర్వహణ
- ఓం యూత్ అసోసియేషన్

కామారెడ్డి జిల్లా రామారెడ్డి , ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం వసంత పంచమిని పురస్కరించుకుని రామారెడ్డి ప్రాథమిక పాఠశాల అవరణలో ఓం యూత్ సభ్యులు స్థాపించిన సరస్వతి మాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు దోమల శ్రీధర్, భూపతి నాగరాజు, డాక్టర్ సుధాకర్, కొటేష్ గౌడ్, మిత్రులు బండి ప్రవీణ్, శ్రీకాంత్, ప్రణయ్ ,శ్రీనివాస్,లు పాల్గొన్నారు.